Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తా

గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తా

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తానని సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. తనకు ఓటు వేసి గెలిపించాలని బుడిగె నర్సింగరావు ప్రజలను కోరారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా నర్సింగ్ రావు నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలో సుమారు 350 మంది తో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు కేంద్రం వద్దకు వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. గ్రామ అభివృద్ధి  కృషిచేస్తానని సర్పంచ్ గా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గతంలో గ్రామ సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని గుర్తుచేస్తారు. మరో సారి సర్పంచ్ గా గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కటకం కృష్ణమూర్తి, మైలారం స్వామి, మైలారం కిట్టు, మైలారం బాబు, కోల రాములు, రాజిరెడ్డి, గ్యార మహేష్, గ్యార సురేష్, అరుణ్ సాయి, బుడిగె శ్రీకాంత్, బుడిగె కిష్టయ్య, దొమ్మట సిద్దులు, నర్సయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -