Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాఘవాపురం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తా 

రాఘవాపురం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తా 

- Advertisement -

కోతుల బెడదను నివారిస్తా : తుంగ చంద్రకళ కుమార్
నవతెలంగాణ – ఆలేర్ రూరల్

ఆలేరు మండలం రాఘవపురం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుంగ చంద్రకళ కుమార్ శుక్రవారం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి నవ తెలంగాణతో మాట్లాడారు. గ్రామం గత 10  సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక మండల లోని అన్ని గ్రామాల కంటే వెనుకబడి పోయిందన్నారు.కనీసం సపాయి కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిల్లో  గ్రామపంచాయతీ ఉండడం నీదర్శనం అన్నారు. వీధి దీపాలు మురుగునీటి మోరీలు సమస్య నెల రోజులలో పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు. అదేవిధంగా వాటర్ ప్లాంట్ ను మరమత్తు చేయించి ప్రజలకు గ్రామ ప్రజలకు మంచి నిటిని అందిస్తను అన్నారు.

గ్రామంలో కోతుల బాధ విపరీతంగా ఉందని రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కోతుల బెడద నివారిస్తానన్నారు. గ్రామంలో తాను 15 సంవత్సరాలకు రాజకీయాల్లో ఉంటూ ఎమ్మార్వో ఎంపీడీవో కార్యాలయంలో ఎవరికి ఏ పని పడినా వెంటనే స్పందించి కులం ధృవీకరణ బర్త్ సర్టిఫికెట్స్ భూముల సమస్యలు పరిష్కరించానన్నారు.ఈ నెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలన్నారు. తనకు ఎన్నికల్లో సర్పంచ్ కు అధికారులు ఉంగరం గుర్తు కేటాయించినట్లు చెప్పారు.తనకు ఓటేసి గెలిపించినట్లయితే నీతి నిజాయితీతో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఆపద సమయాల్లో శుభకార్యాల్లో తోడుగా ఉంటానని ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అర్హులైన వారికి ఇప్పించడం నా బాధ్యతగా భావిస్తాను  అన్నారు.

తన ప్రచారంలో ఇంటింటి కి వెళ్ళినప్పుడు ఆదరణ ప్రజల్లో కనబడుతుందని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఉంగరం గుర్తుకు ఓటేయాలని రాఘవపురం ప్రజలకు పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు గా పోటీ చేస్తున్న 4వ వార్డు సభ్యులు తుంగ సుశ్మిత ,5 లో వార్డు సభ్యులు గడిపె మల్లయ్య 7వ వార్డు సభ్యులు పొద్దుటూరి రమేష్ ,8వ వార్డు సభ్యులు ఎర్ర యాదగిరి మరియు గ్రామ మల్లూరి కనకరాజు,తుంగ ఉపేందర్,మల్లూరి రవీందర్,గౌడ అంజయ్య,మల్లురి బిక్షపతి,బడకలి మధు, మహిళా నాయకులు మల్లూరు పద్మ,గౌడ సత్తమ్మ,మల్లురి భూమిక తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -