Tuesday, December 9, 2025
E-PAPER
Homeబీజినెస్క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తితో అగ్రగామిగా కొనసాగిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్

క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తితో అగ్రగామిగా కొనసాగిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : 2026 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అత్యుత్తమంగా 99.33 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని నమోదు చేసింది. దేశీయంగా అగ్రగామి జీవిత బీమా కంపెనీల్లో ఇది అత్యధికం. అన్నింటికన్నా ముఖ్యంగా సగటు క్లెయిమ్ సెటిల్మెంట్ టర్నెరౌండ్ సమయమనేది నాన్-ఇన్వెస్టిగేటెడ్ క్లెయిమ్‌లకు సంబంధించి కేవలం 1.1 రోజులుగా నమోదైంది. ఇదే వ్యవధిలో మొత్తం రూ. 893.38 కోట్లు విలువ చేసే డెత్ క్లెయిమ్‌లను కంపెనీ సెటిల్ చేసింది.

“మా క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియనేది కస్టమర్లకు అత్యంత మెరుగైన అనుభూతిని అందించే విధంగా రూపొందించబడింది. మేము ప్రతి క్లెయిమ్‌ విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం.

2026 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో మా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 99.33 శాతంగా ఉండగా, నాన్-ఇన్వెస్టిగేటెడ్ క్లెయిమ్‌లకు సంబంధించి సగటున క్లెయిమ్ సెటిల్మెంట్ టర్నెరౌండ్ సమయం 1.1 రోజులుగా నమోదైంది. అదే వ్యవధిలో మేము రూ. 893.38 కోట్లకు పైగా డెత్ క్లెయిమ్‌లను సెటిల్ చేశాం.

కస్టమర్ల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడం, డిజిటలీకరణపై మరింతగా దృష్టి పెట్టడం వల్ల మేము క్లెయిమ్ సెటిల్మెంట్లను వేగంగా పూర్తి చేయగలుగుతున్నాం. తద్వారా కుటుంబాలకు ఎంతో అత్యవసర తరుణంలో, సకాలంలో ఆర్థికంగా ఉపశమనం కలిగించగలుగుతున్నాం. క్లెయిమెంట్లు మా మొబైల్ యాప్, వాట్సాప్, చాట్‌బాట్, వెబ్‌సైట్ల ద్వారా క్లెయిమ్‌లను సులభంగా దాఖలు చేయొచ్చు. ట్రాక్ చేయొచ్చు.

 “క్లెయిమ్ ఫర్ ష్యూర్” నినాదం కింద డాక్యుమెంట్లన్నింటినీ సమర్పించిన తర్వాత అర్హత కలిగిన క్లెయిమ్‌లను ఒక్క రోజులోనే సెటిల్ చేస్తామనే హామీకి అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ. 157.27 కోట్లు విలువ చేసే డెత్ క్లెయిమ్‌లను మేము సెటిల్ చేశాం. గత త్రైమాసికంలో కూడా మేము పరిశ్రమలో అత్యుత్తమ సెటిల్మెంట్ నిష్పత్తిని సాధించాం. Q1-FY2026లో 99.60 శాతం స్థాయిని నమోదు చేశాం” అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ Mr. అమీష్ బ్యాంకర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -