Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న ఆదర్శ ప్రిన్సిపాల్ కృషిత

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న ఆదర్శ ప్రిన్సిపాల్ కృషిత

- Advertisement -

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు జిల్లా స్థాయి అవార్డు
నవతెలంగాణ – కాటారం

కాటారం మండలకేంద్రంలోని ఆదర్శ హై స్కూల్ ప్రిన్సిపాల్ జనగామ కృషిత జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ల చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. మారుమూల ప్రాంతానికి చెందిన విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ వారిని వివిధ రంగాల్లో దేశ , విదేశాల్లో ఉన్నత స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తున్న ప్రిన్సిపల్ కృషితను ఎమ్మెల్యే, కలెక్టర్ శాలువాతో సన్మానించి, షీల్డ్ ను అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కృషిత మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 21వ శతాబ్దం నైపుణ్యాలు, ఆధునిక విద్య బోధన అందిస్తూ అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్ది ఉత్తమ పౌరులను దేశానికి అందించడమే లక్ష్యంగా ఆదర్శ విద్యా సంస్థ 36 ఏళ్లుగా ముందుకు సాగుతుందన్నారు. విద్యార్థులను చదువుతో పాటు క్రీడలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించేలా తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కృషిత ను ట్రస్మా ప్రతినిధులు, ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాజేందర్, ట్రస్మా ప్రతినిధులు సాంబయ్య, సంపత్ రావు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad