భారత నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు. ఈ ఎన్నికల్లో ఎంపీలు వెలువరించిన తీర్పును అంగీకరిస్తున్నా. ఈ ప్రయాణం నాకు లభించిన గొప్ప గౌరవం. ఎన్నికల్లో ఫలితం అనుకూలంగా లేకపోయినా, మనం సమిష్టిగా ముందుకు సాగడానికి ప్రయత్నించిన లక్ష్యం బాగుంది. ఈ సైద్ధాంతిక పోరాటం మరింత శక్తితో కొనసాగుతుంది. నన్ను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టిన ప్రతిపక్ష పార్టీల నాయకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ప్రజాస్వామ్యం విజయం ద్వారా మాత్రమే కాదు, సంభాషణ, అసమ్మతి గళంలో పాల్గొనే స్ఫూర్తి ద్వారా బలపడుతుంది. ఒక పౌరుడిగా, మనల్ని కలిపి ఉంచే సమానత్వం, సోదరభావం , స్వేచ్ఛ యొక్క ఆదర్శాలను నిలబెట్టడానికి నేను కట్టుబడి ఉన్నా. మన రాజ్యాంగం మన జాతీయ జీవితానికి మార్గదర్శక కాంతిగా కొనసాగాలని కోరుకుంటున్నా.
ఇండీ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
మరింత శక్తితో సైద్ధాంతిక పోరాటం
- Advertisement -
- Advertisement -