పీఎం, సీఎంలకు ఊరటా?: ప్రధాని మోడీ
గయా: 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నప్పుడు.. జైలు శిక్ష అనుభవించిన ఒక ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి తమ స్థానం నుంచి దిగిపోకుండా ఎలా ఉంటారని మోడీ ప్రశ్నించారు. తప్పు చేస్తే సీఎం, ప్రధానినైనా తొలగించే బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ఉంటే జైల్లో.. లేకపోతే బెయిల్‌పై ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే అవినీతికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రవేశపెడుతున్న బిల్లును వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. బీహార్‌లోని గయాజీలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. ”కొంతకాలం క్రితం కొందరు నేతలు జైళ్ల నుంచి ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం మనం చూశాం. అవినీతికి పాల్పడే నేతలే పరిపాలన చేస్తే.. ఇక దేశంలో అవినీతిని ఎలా తొలగించగలుగుతాం?” అని మోడీ ప్రశ్నించారు.
ఇకపై క్రిమినల్ నేతలకు అటువంటి అవకాశం ఇవ్వబోమని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడడానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టానికి ఎవరూ అతీతులు కారని.. ప్రధాని కూడా దీని పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు.
50 గంటల అరెస్ట్‌తో ఉద్యోగాలే పోతుంటే..
- Advertisement -
- Advertisement -