Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోవులను రోడ్లపై వదిలేస్తే గోశాలకు తరలిస్తాం

గోవులను రోడ్లపై వదిలేస్తే గోశాలకు తరలిస్తాం

- Advertisement -

మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ 
నవతెలంగాణ – పరకాల 

గోవుల యజమానులు తమ గోవులను రోడ్లపై వదిలేస్తే గోశాలకు తరలించాల్సి ఉంటుందని మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ హెచ్చరించారు. పశువుల యజమానులు నియంత్రణ లేకుండా వాటిని రోడ్లపై విచ్చలవిడిగా వదిలేస్తూ ఉండడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అందులో భాగంగా  ఈనెల 18న రోడ్లపై తిరుగుతున్న పశువులను మున్సిపల్ సిబ్బంది ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందన్నారు. అయినప్పటికీ పశువుల యజమానులు ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవన్నారు.

మున్సిపల్ప్ప సిబ్బంది అదుపులో ఉన్న పశువులకు సంబంధించిన యజమానులు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించి తగిన జరిమానా చెల్లించి, భవిష్యత్తులో పశువులను విచ్చలవిప్పిగా వదలకుండా స్వయం పూచికత్తుపై  విడిపించుకుపోవాలన్నారు. లేనట్లైతే ఈనెల 22 తర్వాత పశువులను గోశాలలకు తరలిస్తామన్నారు. పశువుల యజమానులు తమ పశువులను రోడ్లపై విచ్చలవిడిగా వదిలినట్లయితే చట్టపరమైన చర్యలతో పాటు, వాటి ద్వారా ఏర్పడే  ప్రమాదాలకు బాధ్యులను చేయాల్సి ఉంటుందని కమిషనర్ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -