- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని ఎనబోరా గ్రామ ప్రజల కోసం 40 ఏళ్ల కాలంగా వివిధ పార్టీలో ఉంటూ ప్రజాసేవలో పనిచేస్తూ వస్తున్నానని సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ పటేల్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా షబ్బీర్ పటేల్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రజలు తన సేవలను గుర్తించి, ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే స్థానికంగా ఉంటూ ఎల్లవేళలా మరింతగా ప్రజాసేవ చేయడమే కాకుండా గ్రామ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.
- Advertisement -



