అయిటిపాముల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బెల్లి సుధాకర్
నవతెలంగాణ – కట్టంగూర్
తనకు ఓటు వేసి సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామానికి ప్రజలకు సేవకుడిలా పనిచేస్తానని మండలంలోని అయిటిపాముల మేజర్ గ్రామపంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బెల్లి సుధాకర్ అన్నారు. సోమవారం ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నిత్యం ఊరు శ్రేయస్సు కోసం తపించే తనను గెలిపించాలని కోరారు. ప్రజల మస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గెలిపిస్తే గ్రామంలో మౌలిక వసతులు కల్పించి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముక్కెర ప్రభాకర్, తాటిపాముల పాపయ్య, గోపగోని జానయ్య, గుండా అశోక్, బత్తుల సురేందర్ రెడ్డి, సింగం దినేశ్. గోలి శివ, రావుల సైదులు, కుర్రె ప్రభాకర్, గుండ్లపల్లి ప్రవీణ్, సింగరావు సైదులు, ఎస్ కే షరీష్, పొడిచేటి సైదులు తదితరులు పాల్గొన్నారు.
అవకాశం ఇస్తే సేవకుడిలా పని చేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



