సర్పంచ్ అభ్యర్థి బాచావార్ లక్ష్మణ్
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని మాదన్ఇప్పర్గా గ్రామ ప్రజలకు ముఖ్యమైన రెండు పనులు అత్యవసరంగా ఉన్న వాటిని గ్రామ ప్రజల ఆశీర్వదించి తనను సర్పంచ్ గా గెలిపిస్తే జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ద్వారా వెంటనే ఆ పనులు పూర్తికావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బాచావార్ లక్ష్మణ్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తూ ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ముఖ్యమైన రెండు పనులు ఒకటి వాగు పైన వంతెన నిర్మాణం గ్రామం నుండి డోంగ్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పనులు ముఖ్యమైనవిగా తెలిపారు. సర్పంచ్ గా గెలిస్తే ప్రజల డిమాండ్ ను వెంటనే నెరవేరుస్తానని తెలిపారు. ఆయన గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సర్పంచ్ గా గెలిపిస్తే రెండు ముఖ్యమైన పనులు వెంటనే చేయిస్తా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



