ఈసీఐకి సుప్రీంకోర్టు హెచ్చరిక
అక్టోబర్ 7న తుది వాదనలు
న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) అనుసరిస్తున్న పద్ధతుల్లో ఏదైనా చట్టవిరుద్ధం అని తేలితే, బీహార్‌లో చేపట్టిన ‘ఓటర్ల జాబితా సమగ్ర సవరణ’ (ఎస్‌ఐఆర్)ను రద్దు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీహార్‌లో చేపట్టిన ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలపై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోరుమాల్య బాగ్జిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ నిర్వహణలో ఎలక్షన్ కమిషన్… చట్టాలను, తప్పనిసరి నిబంధనలను పాటించిందని తాము భావిస్తున్నామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఎస్‌ఐఆర్‌పై తాము ఇచ్చే తుది తీర్పు బీహార్‌కు మాత్రమే పరిమితం కాదనీ, దేశం మొత్తానికి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై తుది వాదనలను అక్టోబర్ 7న వింటామని సుప్రీంకోర్టు తెలిపింది.
‘సర్’ నిర్వహణపై నిర్ణయాధికారం మాదే!
అంతకు ముందు, నిర్ణీత కాల వ్యవధుల్లో దేశవ్యాప్తంగా ‘ఓటర్ల జాబితా సమగ్ర సవరణ’ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిర్వహించాలనే ఆదేశాలు జారీ అయితే తమ ప్రత్యేక అధికార పరిధికి విఘాతం కలుగుతుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ‘ఓటర్ల జాబితా సమగ్ర సవరణ’కు సంబంధించిన విధానంపై పూర్తి విచక్షణతో స్వతంత్రంగా నిర్ణయాన్ని తీసుకునే అధికారం తమకు ఉందని పేర్కొంది. ఈ విషయంలో ఇతర సంస్థలతో నిమిత్తం లేకుండా పనిచేసే స్వేచ్ఛ తమకు ఉందని ఈసీ చెప్పింది. ఈ మేరకు వాదనలతో సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ను ఎన్నికల సంఘం దాఖలు చేసింది.
ఆధార్ చెల్లుబాటు
ఎలక్షన్ కమిషన్ బీహార్‌లో చేపట్టిన ఎస్‌ఐఆర్ కోసం 11 గుర్తింపు కార్డులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. అయితే వీటిలో ఆధార్ కార్డు లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఆధార్‌ను గుర్తింపు పత్రంగా పరిగణించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనితో ఆధార్‌ను 12వ గుర్తింపుపత్రంగా పరిగణించాలని సెప్టెంబర్ 8న సర్వోన్నత న్యాయస్థానం ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆధార్ అనేది వ్యక్తుల గుర్తింపునకు, నివాసానికి చట్టబద్ధమైన రుజువుగా మాత్రమే ఉంటుందని, అది పౌరసత్వాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. అయితే వీటిలో ఆధార్ కార్డు లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఆధార్‌ను గుర్తింపు పత్రంగా పరిగణించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనితో ఆధార్‌ను 12వ గుర్తింపుపత్రంగా పరిగణించాలని సెప్టెంబర్ 8న సర్వోన్నత న్యాయస్థానం ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆధార్ అనేది వ్యక్తుల గుర్తింపునకు, నివాసానికి చట్టబద్ధమైన రుజువుగా మాత్రమే ఉంటుందని, అది పౌరసత్వాన్ని సూచించదని స్పష్టం చేసింది. ఈసీ బీహార్‌లో ఎస్‌ఐఆర్ చేపట్టి, సరైన ధ్రువీకరణ లేకుండా లక్షలాది మంది ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తోందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈసీ ఆధార్‌ను గుర్తింపు పత్రంగా గుర్తించకపోవడం వల్ల నిజమైన ఓటర్లకు అన్యాయం జరుగుతోందని వాదించాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 18న విడుదల చేసిన ఎస్‌ఐఆర్ ముసాయిదా జాబితాలో ఏకంగా 65 లక్షల మంది పేర్లు తొలగించబడ్డాయి.
ఓట్ చోరీ
‘ఓట్ చోరీ’ జరిగిందంటూ కాంగ్రెస్ నేతత్వంలోని విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. బీజేపీతో ఈసీ కుమ్మక్కయ్యి ఓట్ చోరీ చేస్తోందం టూ బీహార్ అంతటా ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టాయి. అయితే దీనిపై ఎలక్షన్ కమిషన్ మండిపడింది. విపక్ష పార్టీలు ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నాయని ప్రత్యారోపణలు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్ తన ఆరోపణలకు ఆధారాలతో సహా అఫిడవిట్ దాఖలు చేయాలని, లేకుంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఈసీఐ చెప్పిన విషయం తెలిసిందే.