Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షం వస్తే ఇంటికి రారు.. రాకుంటేనే ఇంటికి వస్తరు!

వర్షం వస్తే ఇంటికి రారు.. రాకుంటేనే ఇంటికి వస్తరు!

- Advertisement -

– రెండు ఊర్ల ( గ్రామాల) మధ్యన వాగు వర్షం వస్తే రాకపోకల బందు –
అధికారుల పర్యవేక్షణ కరువు,, వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి
– సీపీఐ(ఎం) మండల నాయకులు బత్తుల జనార్దన్ గౌడ్
నవతెలంగాణ – నూతనకల్:
ఒక రోడ్డు పునర్నిర్మాణ లో భాగంగా ఉన్న రోడ్డున తవ్వి బ్రిడ్జి నిర్మిస్తానన్న సదర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వర్షం వస్తే రెండు గ్రామాల మధ్య రాక  పోకలు బంద్ అవుతున్నాయి. ఆ గ్రామంలోని ప్రజలు వేరే గ్రామానికి, వ్యవసాయ పనుల నిమిత్తం  వాగు దాటి పొలం దగ్గరికి వెళ్లిన వారు “వర్షం వస్తే వాగులో నీళ్ళు ప్రవహించడం ద్వారా ఇంటికి రారు. వర్షం రాకుంటేనే ఇంటికి వస్తారు” అనే నానుడి ఆ గ్రామ ప్రజలలో ఉంది. ఈ  సంఘటన మండల పరిధిలోని వెంకేపల్లి శివారు అటు తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం, శివారులో ఈ రెండు గ్రామాల మధ్య చోటుచేసుకుంది.

  శాసనసభ సభ్యులు మందుల సామెల్  జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం నుండి సంగెం మీదిగా నూతనకల్ మండల కేంద్రం వరకు రోడ్డు నిర్మాణ పనుల కోసం పంచాయతీరాజ్ శాఖ నిధుల నుండి సుమారు  34 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయించారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా వాగులు ఉండడంతో బ్రిడ్జిల నిర్మాణానికే  విధులు ఖర్చై వెంకేపెళ్లి వరకే రోడ్డు పనులు చేపట్టారు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షం వచ్చినప్పుడు రాకపోకలు బంద్ అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు గుంతల మయం అవ్వడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని  ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో  రాకపోకలు బంద్
మండల కేంద్రం నుండి తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రానికి ప్రధాన రహదారి ఇది చిల్పకుంట్ల, వెంకేపల్లి సంగెం, అన్నారం మీదుగా తుంగతుర్తికి గత 30 సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సు ప్రయాణించేది. సంగెం  కోడూరు పాలేరు వాగు ఉంది ఆ ప్రదేశంలో కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బ్రిడ్జి నిర్మించకపోవడంతో వర్షం వస్తే రాకపోకలు బంద్ అవుతున్నాయి. ఇటు, సంగెం వెంకీపెళ్లి గ్రామాల మధ్య ఉన్న వాగులలో బ్రిడ్జి నిర్మించడం కోసం గుంటలు తవ్వి పిల్లర్లు వేవ్వకుండా ఉండడంతో అకాల వర్షంతో భారీ  వరధ రావడంతో కొన్ని రోజులుగా ఈ రెండు గ్రామాలకు రవాణా బంద్ అయింది. విద్యార్థులు పాఠశాలలకు బందు కావడం, రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల దగ్గరికి వెళ్లకపోవడంతో  అనేక ఇబ్బందులు పడుతున్నారు. 

నవతెలంగాణ దినపత్రిక ఇటీవల ప్రచురించిన  కథనానికి స్పందించిన అధికారి , కాంట్రాక్టర్ తాత్కాలిక మరమతి చేసి వాటికి గుణాలు వేసి మట్టి పోశారు. కానీ మళ్ళీ ఇటీవల  కురిసిన భారీ వర్షాలకు  మళ్లీ మొత్తం మట్టి కొట్టకపోవడంతో పెద్ద గండి ఏర్పడింది. మళ్లీ రాకపోకలు బందు కావడంతో విద్యార్థులు రైతులు, ప్రయాణికులు, అనేక ఇబ్బంది పడుతున్నారు. వర్షం రావడం వరద తగ్గిన అనంతరం మళ్లీ కాంట్రాక్టర్ తాత్కాలిక మరమ్మతు చేయడం అలవాటైపోయింది.  సంగెం చేరుకోవాలంటే   మండల కేంద్రంలోని పాఠశాలకు రావాలంటే అన్నారం, మద్దిరాల అడ్డరోడ్డు నుంచి సుమారు 25 కిలోమీటర్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రోడ్డు పనులను పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తాత్కాలిక ఏర్పాట్లు కాదు బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి: సీపీఐ(ఎం) మండల నాయకులు బత్తుల జనార్ధన్ గౌడ్
తాత్కాలిక ఏర్పాట్లతో శాశ్వత పరిష్కారం కాదని పూర్తిగా బ్రిడ్జిని శాశ్వతంగా నిర్మాణం చేపట్టి రోడ్డు పునర్ నిర్మాణం చేపడితేనే పరిష్కారం అవుతుందని వేసవికాలంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేసి వర్షాకాలపు సీజన్లో పనులు చేస్తూ మధ్యలో నిలిపివేయడంతో అకాల వర్షానికి రెండు గ్రామాల మధ్య ప్రయాణికుల అనేక ఇబ్బందులు పడుతున్నారని  ఆరోపించారు. తన వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి లేక అనేక ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు కాంట్రాక్టర్ ప్రజా ప్రతినిధులు స్పందించి నిర్మాణం చేపట్టకపోతే సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -