Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ అగ్నిగుండమే..

కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ అగ్నిగుండమే..

- Advertisement -

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంపై కాంగ్రెస్ విషప్రచారం
రేవంత్.. మీరు పాలమూరు బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయండి
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 
నవతెలంగాణ – వనపర్తి  

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంపై కాంగ్రెస్ విషప్రచారం చేస్తూ బిఆర్ యస్ అధినేత కెసిఆర్ జోలికొస్తే తెలంగాణ అగ్నిగుండమే అవుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వర్ ప్రాక్టుపై ఘోష్ కమిషన్ వేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ బి.ఆర్.ఎస్ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి,కృష్ణా నదులపై ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణకు కాంగ్రెస్,టి.డి.పి పార్టీలు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. తెలంగాణ సాధించిన కె.సి.ఆర్  కృష్ణా నదిపై పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించి 12లక్షల ఎకరాలకు సాగు నీరు అదేవిధంగా గోదావరి నదిపై రికార్డ్ స్థాయిలో 3ఏండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి 70 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి తెలంగాణను సస్యశామలం చేశారన్నారు.

అటువంటి మహానాయకునిపై 94 వేల 300కోట్లు ఖర్చు చేస్తే లక్ష కోట్లు దోచుకున్నారని కమిషన్ వేసి రేవంత్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు. కేంద్ర జలవనరుల ఇంజనీర్స్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించి కె.సి.ఆర్ అద్భుతం సృష్టించారని కితాబు ఇచ్చిన విషయాని రేవంత్ మరవొద్దని హితవు పలికారు. అన్ని శాఖల అనుమతులు తీసుకొని ప్రాజెక్ట్ పూర్తి చేసిన కె.సి.ఆర్ సమర్ధతను తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారని తన గురువు చంద్రబాబు మెప్పు కోసమే కాళేశ్వరంపై రేవంత్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా 10శాతం మిగిలిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం కె.సి.ఆర్ పై కుట్ర కమిషన్ వేసి దుష్ప్రచారం చేయడం దారుణమని నిజంగా రేవంత్ పాలమూరు బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ పొద్దున లేస్తే సి.బి. ఐ, ఐ.టి,ఈ.డి మోడీ జేబు సంస్థలు అని ఒకవైపు గగ్గోలు పెడుతుంటే రేవంత్ రెడ్డి సి.బి. ఐ విచారణకు కోరడం అంటే మోడీ కోసమే రేవంత్ పనిచేస్తున్నారని అర్ధం అవుతుందని అన్నారు. ఆహార ఉత్పత్తిలో ఈ ప్రాజెక్టులు కీలకంగా మారి పంజాబ్ ను మించి 3వేల కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తులు సాధించడానికి కె.సి.ఆర్ కృషి చేశారని కొనియాడారు. ఘోష్ కమిషన్ ట్రాష్ అని, అసెంబ్లీలో చర్చించకుండా సి.బి. ఇ కి అప్పజెపడంతోనే కాంగ్రెస్ పార్టీ అభాసుపాలు అయిందని ఘాటుగా నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఎన్ని కమీషన్లు వేసినా కె.సి.ఆర్ గారిని ఏమి చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రములో ఒకవైపు యూరియా కొరత,వరదలతో బాధపడుతుంటే రేవంత్ పట్టించుకోకుండా కె.సి.ఆర్ పై కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కె.సి.ఆర్ గారికి అండగా నిలిచి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాటిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, పరంజ్యోతి, గులం ఖాదర్, కే మాణిక్యం, జాతృ నాయక్, నరసింహ, విజయ్, ఉస్మాన్, నాగన్న యాదవ్, ఉంగ్లం తిరుమల్, కంచ రవి, స్టార్ రహీం, బండారు కృష్ణ , షేక్.జహంగీర్,డేగ మహేశ్వరెడ్డి, మాధవ రెడ్డి , హేమంత్ ముదిరాజ్, సూర్యవంశం గిరి, సునిల్ వాల్మీకి, జోహెబ్ హుషన్, చిట్యాల రాము, సయ్యద్ జమీల్, సురేష్, ఏకే పాషా,బాలకృష్ణ, గోపాల్ నాయక్, బాలరాజు, ఆశన్న నాయుడు ముని కుమార్, భాను, ఆశన్న నాయుడు శంకర్, భగవంతు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad