Wednesday, December 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమతోన్మాదం పెరిగితే కార్మిక ఐక్యతకు విఘాతం

మతోన్మాదం పెరిగితే కార్మిక ఐక్యతకు విఘాతం

- Advertisement -

సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌
మెదక్‌ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి

మతోన్మాదం పెరిగితే కార్మికవర్గ ఐక్యతకు మరింత విఘాతం ఏర్పడుతుందని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ హెచ్చరించారు. అది పెరగకుండా తగిన పోరాటాలు నిర్వహించటంతోపాటు ప్రత్యామ్నాయ భావజాల వ్యాప్తికి కృషి చేయాలని సూచించారు. మెదక్‌లో నిర్వహించిన సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభ ముగింపు సందర్భంగా మంగళవారం ఆయన ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ…రాబోయే కాలంలో కార్మిక వర్గం అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. లేబర్‌ కోడ్‌ల ప్రమాదం గురించి గ్రామాలు, పరిశ్రమలు, నివాస ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

క్షేత్రస్థాయి పోరాటాలను బలోపేతం చేయాలి : డాక్టర్‌ కే.హేమలత
పాలక వర్గాలు కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే విధానాలకు పాల్పడుతున్నాయని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్‌ కే.హేమలత ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని తిప్పికొట్టేందుకు వీలుగా క్షేత్రస్థాయి పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ సర్కార్‌ సనాతన ధర్మం పేరుతో రాజ్యాంగ, స్వతంత్ర వ్యవస్థల్లోకి మత భావాలను జొప్పిస్తోందని తెలిపారు. తద్వారా కార్మికుల్లో చీలకలు తెచ్చేందుకు కుయుక్తులు పన్నుతోందని దుయ్యబట్టారు. ఇప్పుడు కార్మిక చట్టాల్లోకి కూడా అలాంటి భావాలను తీసుకొచ్చిందని విమర్శించారు. వాటికి వ్యతిరేకంగా పోరాడాలని నొక్కి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -