Thursday, December 11, 2025
E-PAPER
Homeఆటలుబ్యాటర్లు రాణిస్తే విజయం మనదే..

బ్యాటర్లు రాణిస్తే విజయం మనదే..

- Advertisement -

నేడు దక్షిణాఫ్రికాతో రెండో టి20
రాత్రి 7.00గం||లకు

ఛండీగడ్‌: దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టి20లోనూ నెగ్గి సిరీస్‌ ఆధిక్యతలో దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తోంది. కటక్‌ వేదికగా జరిగిన తొలి టి20లో 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన భారతజట్టు ఈ ఫార్మాట్‌లో అద్భుత ఫామ్‌లో దూసుకెళ్తోంది. ఈ ఫార్మాట్‌లో టీమిండియా గత రెండేళ్లలో సిరీస్‌ కోల్పోయిన దాఖలాలు లేవు. కేవలం ఒక రోజు వ్యవధిలో రెండో టి20కి సిద్ధమైన ఇరుజట్లు ఆఘ మేఘాలమీద మహారాజా యాదవీంద్ర సింగ్‌ స్టేడియంకు చేరుకున్నాయి. కనీసం ప్రాక్టీస్‌ చేసేందుకు కూడా ఏ జట్టుకూ అవకాశం దక్కలేదు. తొలి టి20లో ఆల్‌రౌండర్‌ హర్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మకి తోడు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచారు. మిడిలార్డర్‌లో తిలక్‌ వర్మ, అక్షర్‌ పటేల్‌కి తోడు హార్దిక్‌ పాండ్యా రాణించడంతో భారీస్కోర్‌ నమోదు చేసింది. హార్దిక్‌ పాండ్యా(59నాటౌట్‌; 28బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లు) ధనా ధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు.

మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు తొలి మ్యాచ్‌ ఓటమినుంచి బయటపడి ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఆ జట్టులో ఏ ఒక్క బ్యాటర్‌ క్రీజ్‌లో నిలదొక్కుకున్నా ఫలితం తారుమారు కావడం ఖాయం. టీమిండియా నిర్దేశించిన 176పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీ జట్టు 12.3 ఓవర్లలో 74పరుగులకే ఆలౌట్‌ కావడం కలవరపరుస్తోంది. టాపార్డర్‌ బ్యాటర్లు రాణించినా.. మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. సఫారీ జట్టు బౌలర్లు తొలి 10ఓవర్లలో భారత్‌ను కట్టడి చేసినా.. ఆ తర్వాత తేలిపోయారు. ఎన్గిడి(3/31), యాన్సెన్‌(0/23) 4ఓవర్ల కోటా బౌలింగ్‌ను సమర్ధవంతంగా ముగించినా.. సిపమ్లా(2/38)కి తోడు నోర్ట్జే (0/41) నిరాశపరచడం కెప్టెన్‌ మార్‌క్రమ్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో రెండో టి20కి సఫారీ జట్టు పేసర్‌ కార్బిన్‌ బాష్‌, స్పిన్నర్‌ జార్జి లిండేలలో ఒకరిని తుదిజట్టులోకి తీసుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు ఓటమిపాలవ్వడంతో రెండో టి20లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

బౌలర్ల ప్రదర్శనపై ప్రశంసలు
భారత బౌలింగ్‌ విభాగంపై సూర్యకుమార్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యంగా కొత్త బంతితో ఆర్ష్‌దీప్‌, బుమ్రా అద్భుతంగా బౌల్‌ చేశారని పొగడ్తలతో ముంచెత్తాడు. ”సౌతాఫ్రికా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నప్పుడు, మా బౌలర్లు ఎలా స్పందిస్తారో చూడాలనుకున్నానని, ఆర్ష్‌దీప్‌, బుమ్రా కొత్త బంతితో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వారిద్దరూ ఈ పిచ్‌పై బౌలింగ్‌ చేయడానికి సరైన ఎంపిక అని నిరూపించుకున్నారు. 175 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మా బౌలర్లు చూపిన తెగువ, మాకున్న బౌలింగ్‌ వనరులు విజయంలో కీలక పాత్ర పోషించాయి” అని సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు.

జట్లు(అంచనా)…
ఇండియా: సూర్యకుమార్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌(వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌, దూబె, అక్షర్‌, జితేశ్‌(వికెట్‌ కీపర్‌), బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్‌.
దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్‌(కెప్టెన్‌), డికాక్‌(వికెట్‌ కీపర్‌), జోర్జి, బ్రెవీస్‌, స్టబ్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, యాన్సెన్‌, మహరాజ్‌, నోర్ట్జె, ఎన్గిడి, హెండ్రిక్స్‌/బార్ట్‌మన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -