Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్నా దగ్గర పని చేసిన వాళ్ళు సీఎంలైతే..నేను రోడ్డు మీద ఉన్న

నా దగ్గర పని చేసిన వాళ్ళు సీఎంలైతే..నేను రోడ్డు మీద ఉన్న

- Advertisement -

– నేను పార్టీ మారటం కాదు.. చచ్చిపోయేదాకా కాంగ్రెస్ లోనే ఉంటా..
– కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో ఆకట్టుకున్న వీహెచ్ మాటలు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి

“నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్, చంద్రబాబు నా దగ్గరే పని చేశారు. వాళ్లు సీఎంలు అయ్యారు. నేను మాత్రం రోడ్ల మీద ఉట్టిగానే తిరుగుతున్నాను” అని సీనియర్ నాయకులు వి. హనుమంతరావు (వీహెచ్) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్రలో ఆ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు (వీహెచ్) ఆకట్టుకున్నారు. యాత్రలో కాంగ్రెస్ పాటలకు వీహెచ్ ఉత్సాహంగా గంతులు వేయడం అందరినీ ఆకర్షించింది. అనంతరం కార్నర్ మీటింగ్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.  తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రెండుసార్లు వచ్చినప్పటికీ, తాను ఆ పదవిని తీసుకోలేదని చెప్పారు. పార్టీలు మారి పదవులు అనుభవిస్తున్న నాయకులు చాలా మంది ఉన్నారని, కానీ తాను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు ఎన్ని పదవులు ఆశ చూపినా, తాను పార్టీని విడిచి వెళ్ళలేదని చెప్పారు.

బీజేపీపై, బీసీ రిజర్వేషన్లపై వీహెచ్ విమర్శలు

 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో హిందువులే ఉండాలని చెబుతోందని వీహెచ్ విమర్శించారు. “మరి ముస్లింలు, క్రైస్తవులు ఎక్కడికి పోవాలి?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే అన్ని మతాలు, కులాలకు రక్షణ ఉంటుందని ఆయన అన్నారు. బీజేపీ దొంగ ఓట్లతోనే గెలుస్తోందని, బీహార్‌లో 68 లక్షల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఎన్నికల సంఘం అన్నీ బీజేపీ జేబుల్లోనే ఉన్నాయని విమర్శించారు. కామారెడ్డిలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని వీహెచ్ చెప్పారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతోందని వీహెచ్ అన్నారు. మహిళలు ఈ పథకం ద్వారా తమ బిడ్డలు, తల్లులు, కొడుకుల దగ్గరికి వెళ్లగలుగుతున్నారని చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి ప్రస్తావిస్తూ, ఆయన హయాంలోనే టెక్నాలజీని అభివృద్ధి చేసి భారతదేశం ముందుకు పోయేలా మార్గాలు వేశారని అన్నారు. రాజీవ్ గాంధీ హయాంలోనే మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad