Wednesday, December 3, 2025
E-PAPER
Homeమానవిఈ సమస్య ఉంటే..!

ఈ సమస్య ఉంటే..!

- Advertisement -

పులిపిరులు ఒకసారి వచ్చాయంటే వాటిని వదిలించుకోవడం చిన్నపని కాదు. మొటిమల్లాగ వాటంతట అవే వచ్చి అవే రాలిపోయే గుణం వీటికి ఉండదు. చర్మవైద్య నిపుణులను సంప్రదించి వైద్యం చేయించుకోవాల్సిందే. పులిపిరులు జన్యుపరమైన కారణాలతో వస్తాయనుకోవడం పరిపాటి. నిజానికి అది అవాస్తవం.
పులిపిరులు ఉన్న వాళ్లు వాడిన టవల్‌ను, సబ్బును ఇతరులు వాడినప్పుడు వాళ్లకు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే పులిపిరి ఉన్న వ్యక్తి తగలడం ద్వారా ఒకరి చర్మం మరొకరి చర్మాన్ని తాకడం వల్ల కూడా వ్యాప్తి చెందుతాయి. మరో ముఖ్యమైన సంగతి ఏమిటంటే.. పులిపిరి ఉన్న వ్యక్తి టవల్‌తో ఒళ్లు తుడుచుకునేటప్పుడు కూడా జాగ్రత్త పాటించాలి. పులిపిరి ఉన్న చోట తుడిచిన తర్వాత అదే టవల్‌ దేహంలో మరొక చోట చర్మానికి తగిలినప్పుడు అక్కడ కూడా పులిపిరి వస్తుంటుంది.
సర్జరీ ఎప్పుడు?
పులిపిరి తీరును బట్టి తొలగించే విధానం కూడా మారుతుంది. చర్మం పెరగడం వల్ల ఏర్పడే పులిపిరిని స్కిన్‌ గ్రోత్‌ వార్ట్‌ అంటారు. వీటిని కాస్మటిక్‌ సర్జన్‌ తొలగిస్తారు. వాతావరణ కాలుష్యం చర్మం మీద చూపించే దుష్ప్రభావం వల్ల ఏర్పడే పులిపిర్లను వైరల్‌ వార్ట్స్‌ అంటారు. వీటికి డెర్మటాలజిస్టులు వైద్యం చేయాల్సి ఉంటుంది. చర్మం మీద సిస్ట్‌ ఏర్పడడం, కొవ్వు చేరడం, పుట్టుమచ్చ సైజు పెరుగుతూ పులిపిరిగా మారడం వంటి లక్షణాలను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -