మేమిచ్చే ఆదేశాలు హైడ్రా ఎందుకు పాటించడం లేదు : హైకోర్టు
హైదరాబాద్ : మా ఆదేశాలను హైడ్రా పాటించడం లేదని తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కోర్టు అధికారం చూపాల్సి వస్తుందని పేర్కొంది. తుమ్మిడికుంట పునరుద్ధరణలో ఇతర భూముల్లో యథాస్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి హైడ్రా పనులు చేపట్టిందంటూ ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఆదేశాల మేరకు కమిషనర్ రంగనాథ్ ఆన్‌లైన్ వేదికగా విచారణకు హాజరయ్యారు. హైడ్రాకు వ్యతిరేకంగా రోజూ 10 పిటిషన్లు వస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. ప్రజలకు మంచి జరిగే పనులు చేయాలని హైడ్రాను జస్టిస్ విజయసేన్ రెడ్డి ఆదేశించారు. చెరువులో జీవ వ్యర్థాలను మాత్రమే తొలగించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజారోగ్యం దృష్టా చెరువు పునరుద్ధరణ చేసినట్టు తెలిపారు. హైడ్రా పనులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. మరి 50, 100 గజాల్లో ఉన్న నిర్మాణాలే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. పెద్ద పెద్ద నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించింది. చట్టప్రకారమే హైడ్రా నడుచుకుంటుందని ఏఐజీ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదన విన్న కోర్టు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. మా అధికారాలేంటో చూపుతాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



