నవతెలంగాణ-తొగుట
ప్రకృతినీ మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని ఎంపిడిఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వెంట్రావుపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహోత్సవనవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఎంపిడిఒ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్క నాటడమే కాకుండా వాటిని రక్షించే బాధ్యత కూడా మనమే తీసుకోవాలని అన్నా రు. జన్మదిన కార్యక్రమాలలో భాగంగా పర్యావరణాన్ని కాలుషితం చేయకుండా ప్రతి జన్మదినం రోజు ఒక్క మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఏపిఓ, టిఎ, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బెజ్జనబోయిన అనిల్, ప్రధానోపాధ్యాయురాలు నాయిమా కైసర్, ఉపా ధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి రవీందర్, దుబ్బాక ఆత్మ కమిటీ డైరెక్టర్ బి. ప్రవీణ్, పిల్డ్ అసిస్టెంట్ నవీన్, అంగన్వాడీ టీచర్స్, ఆశా కార్య కర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షులు వోలపు నారాయణ, గ్రామస్తులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు.
ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది: ఎంపిడిఓ శ్రీనివాస్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES