పామనుగుండ్ల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి వడ్డె మాధవి
నవతెలంగాణ – కట్టంగూర్
ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామపంచాయితీని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మండలంలోని పామనుగుండ్ల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి వడ్డె మాధవిసైదిరెడ్డి అన్నారు. సోవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి మీ ఇంటి ఆడబిడ్డగా ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలందరికీ సేవ చేస్తానన్నారు. తన భర్త ఐదు సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్ గా ఉంటూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశాడని, మిగిలిన పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఆదరించి గెలిపిస్తే గ్రామంలోని బొడ్రాయి ప్రతిష్ట హనుమాన్ దేవాయలం, ఐబీ అండర్ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయడంతో వాటర్ ప్లాంట్, గ్రంధాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆదరించి అక్కున చేర్చుకొని గెలిపిస్తే యువత, గ్రామస్తుల సహకారంతో గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తానని, యువత, గ్రామస్తుల సహకారంతో గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తానని పేర్కొన్నారు.
ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ది చేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



