నవతెలంగాణ -హైదరాబాద్: పార్టీలో కొనసాగుతూ.. పార్టీ నియమాలు, విధానాలను ధిక్కరిస్తే వారు ఎంతటి వారైనా సరే నిర్ధాక్షిణ్యంగా సస్పెండ్ చేయాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఇవాళ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావులపై చేసిన ఆరోపణలపై మల్లారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. పార్టీకి నష్టం చేకూర్చే ఎవరినీ ఊపేక్షించేది లేదన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు కన్నబిడ్డ కన్నా ప్రజలు, తెలంగాణే ముఖ్యమని అన్నారు. కుటుంబంలో సమస్యలు సర్వసాధారణమని.. అవన్ని త్వరలోనే సమసిపోతాయని కామెంట్ చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ అని.. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయాల్సిందే: మల్లారెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES