Friday, June 13, 2025
E-PAPER
Homeమానవిఈ మూడూ పాటిస్తే...

ఈ మూడూ పాటిస్తే…

- Advertisement -

చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ తరచుగా అస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ అనారోగ్యం బారిన పడటానికన్నా ముందు తమ ఆరోగ్యం తమ చేతుల్లోనే వుందన్న సత్యాన్ని మాత్రం పట్టించుకోరు. దైనందిన జీవితంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే వుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ మన చేతుల్లోనే వున్న ఆ మూడు జాగ్రత్తలేంటో చూద్దాం…
మంచి నిద్ర:
నిద్ర కోసం ఒక ఆరోగ్యకరమైన సమయపాలన పాటించాలి. ఆ షెడ్యూల్‌ ప్రకారం నిత్యం నిద్రపోవాలి. రోజుకి కనీసం 8 గంటల నిద్ర అవసరం. 8 గంటలపాటు నిద్రపోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడమేకాకుండా గుండె సంబంధిత వ్యాధులను దరి చేరనివ్వకుండా చేస్తుంది. అన్నింటికిమించి మనిషి మంచి ఉత్సాహంతో ఉండటానికి ఈ నిద్ర ఎంతో ఉపకరిస్తుంది.
చక్కటి పౌష్టికాహారం:
చక్కటి ఆరోగ్యానికి చక్కటి పౌష్టికాహరం ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్‌ అధికంగా వుండి, కొవ్వు తక్కువగా వుండే పదార్థాలు ఆహారంగా తీసుకోవాలి. ముఖ్యంగా శాఖాహారానికే అధిక ప్రాధాన్యత ఇస్తే మరీ మంచిది. ఒకవేళ మాంసాహారం తీసుకున్నా… అవి వేపుడు చేసిన ఆహార పదార్థాలు కాకుండా ఉడకబెట్టినవి.. కోడి, చేపలు లాంటి తేలికపాటి మాంసాహారం మాత్రమే తీసుకోవాలి. తద్వారా అధిక మొత్తంలో కొవ్వు, క్యాలరీలు శరీరంలోకి చేరకుండా జాగ్రత్తపడవచ్చు. పచ్చి కూరగాయల ముక్కలు.. సలాడ్‌గా తీసుకోవడం ద్వారా శరీరానికి తగిన స్థాయిలో విటమిన్లు, ప్రొటీన్లు లభిస్తాయి.
వ్యాయమం:
నిత్యం 30 నుంచి 60 నిమిషాల పాటు వ్యాయమం చక్కటి ఆరోగ్యానికి ఎంతో అవసరం. అలా వారానికి ఐదారుసార్లయినా వ్యాయామం చేస్తే గుండె సంబంధిత వ్యాధులు మీ గుండెకి ఆమడదూరంలో వుంటాయంటున్నారు నిపుణులు. వివిధ రకాల వ్యాయామాలతో శరీరాన్ని ఎల్లప్పుడూ ఫిట్‌గా వుంచుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -