•బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నాగరాజుగౌడ్
నవతెలంగాణ – బొమ్మలరామారం
ఈనెల 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో యువకుడిగా అవకాశం ఇచ్చి బ్యాట్ గుర్తుకు ఓటేసి తనను సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలిపించాలని చీకటిమామిడి గ్రామపంచాయతీ సర్పంచ్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తిరుమని నాగరాజ్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆ గ్రామంలోని బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. చీకటిమామిడి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తానన్నారు.
గ్రామంలో ఏ సమస్య వచ్చిన ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. గ్రామంలో సమస్యలన్నీ తెలుసునని ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించినట్లయితే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుది చూపిస్తానన్నారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేస్తానన్నారు. నిత్యం గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు. అలాగే గ్రామంలోని నిరుద్యోగ యువతకు పరిశ్రమల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.సిసి రోడ్లు,అన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేస్తానన్నారు. పంచాయతీ పాలన పారదర్శకంగా నిర్వహించి గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబడతానన్నారు. గ్రామ సేవకుడిగా ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి గ్రామ ప్రజలను ఆశీర్వదించాలని విన్నపించారు.



