Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్ఈ రోజు మిస్ అయితే మళ్లీ సెప్టెంబర్ లోనే..!

ఈ రోజు మిస్ అయితే మళ్లీ సెప్టెంబర్ లోనే..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే ఈ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఒకవేళ ఎవరైనా రేషన్ బియ్యం తీసుకోకుంటే.. మళ్లీ సెప్టెంబర్ నెలలోనే రేషన్ బియ్యం ఇస్తారు. భారీ వర్షాలు, వరదల ముప్పు వంటి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించింది. తెలంగాణలో ఈ కార్యక్రమం దాదాపు పూర్తయింది. ఇప్పటివరకు 92.18% లబ్ధిదారులకు 5.27 లక్షల టన్నుల సన్న బియ్యం సరఫరా చేశారు. కాగా ఇంకా ఎవరైనా లబ్ధిదారులు బియ్యం తీసుకోకుంటే.. తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో సమీప రేషన్ షాపులకు వెళ్లి బియ్యం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img