అయిటిపాముల కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి బెజవాడ సైదులు
నవతెలంగాణ – కట్టంగూర్
ఆదరించి గెలిపిస్తే గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మండలంలోని అయిటిపాముల మేజర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బెజవాడ సైదులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది సుక్కయ్య అధ్వర్యంలో మంగళవారం నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను ఓటు అభ్య ర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో ప్రజలు ఆదరించి తన భార్య సరోజనను సర్పంచ్ గెలిపిండంతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. ప్రధానంగా రైతు వేదిక, సీసీ రోడ్డు, మైనేజీలను నిర్మిండంతో పాటు గ్రామ అవసరాల కోసం గ్రామపంచాయతీకి రెండుట్రాక్టర్లు, ఆటో, ట్యాంకర్ ను మంజూరు చేయించా నని తెలిపారు.
తన సహకారంతో గ్రామంలోబీఈడీ, బీపీడీ కళాశాల, కాటన్ మిల్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే గెలువగానే నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ. 30లక్షలు, గ్రామంలో సీసీ రోడ్లుకు రూ.34 లక్షలు మంజూరు చేయించడంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఒక్క అవకాశం ఇవ్వండి మీకు సేవకుడిగా ఉంటూ గ్రామాన్ని అభి వృద్ధి చేస్తూ ప్రజలందరికీ సేవ చేస్తానన్నారు. తాను గెలిస్తే ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసి పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తానన్నారు.
అదరించి గెలిపిస్తే గ్రామంలోని రోడ్ల నిర్మాణానికి ప్రధమ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అక్కున చేర్చుకొని గెలిపిస్తే యువత, గ్రామస్తుల సహకారంతో గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తానని పేర్కొన్నారు. అదరింది గెలిపిస్తే గ్రామంలోని రోడ్ల నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గ్రామంలో కోతుల బెడద లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.



