ముత్యాలమ్మగూడెం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కారింగ్ జ్యోతిలింగస్వామి
నవతెలంగాణ – కట్టంగూర్
ప్రజలు ఆదరించి సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామానికి సేవకురాలి గా పని చేస్తానని మండలంలోని ముత్యాలమ్మ గూడె బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కారింగ్ జ్యోతి లింగస్వామి అన్నారు. మంగళవారం గ్రామంలోని తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను గెలిస్తే గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి, వీధిలైట్లు, నీటి సమస్య లేకుండా చర్యలు చేపడతానని చెప్పారు.గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే బిల్లంకానిగూడెం, కారింగ్ గూడెం, సవుళ్లగూడెం, ముత్యాలమ్మగూడెం, కమ్మగూ డెం గ్రామాలకు రోడ్లకు, మౌలిక వసతుల ఏర్పా టుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.
ఆదరించి గెలిపిస్తే ప్రజా సేవ చేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



