ప్రశాంతంగా నిద్రపట్టాలంటే.. ముఖ్యంగా రాత్రి సమయంలో అతిగా భోజనం చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. నిద్రకు రెండు గంటల ముందే రాత్రి భోజనాన్ని ముగించాలని, ఇలా చేయటం వల్ల మీ నిద్రకు ఎలాంటి ఆటంకం ఉండదని చెబుతున్నారు. అలాగే, టీవీ, ఫోన్, ల్యాప్ టాప్ వంటి వాటితో రాత్రి వేళ ఎక్కువ సమయం గడపవద్దు అంటున్నారు. దీంతో ఫోన్ నుంచి విడుదలయ్యే నీలి రంగు కాంతి నిద్రకు ఆటంకం కలిగిస్తుందని అంటున్నారు. ఇకపోతే, నిద్రపోయే ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. పాలలో ఉండే ట్రిప్టోపాన్ అనే అమినో యాసిడ్ శరీరంలో నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల చక్కగా నిద్రపడుతుంది. అంతేగానీ, రాత్రి సమయంలో టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, కేక్స్ తీసుకోకూడదని అంటున్నారు. వీటిలో ఉండే షుగర్, కెఫిన్లు నిద్రకు ఆటంకం కలిగిస్తాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రోజువారీ వ్యాయామం ద్వారా కూడా నిద్రలేమి లక్షణాలను నియంత్రించవచ్చు అంటున్నారు నిపుణులు.. రోజూ తగినంత వ్యాయామం చేయటం వల్ల శరీరానికి అలసట, మనసుకు ప్రశాంతత కలుగు తాయి. ఒత్తిడి తగ్గి గాఢ నిద్రకు దోహదం చేస్తుం ది. అంతేకాదు.. ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొంద డానికి కూడా వ్యాయామం తప్పనిసరి. ఇకపోతే, నిద్రపోయే ప్రదేశం ప్రశాంతంగా, ఎలాంటి శబ్దాలు లేకుండా చీకటిగా ఉండేలా చూసుకోండి.