Friday, September 12, 2025
E-PAPER
Homeమానవిమ‌న‌సుకు హ‌త్తుకుంటే న‌టిస్తా..

మ‌న‌సుకు హ‌త్తుకుంటే న‌టిస్తా..

- Advertisement -

అమల అక్కినేని… ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరు. ఓ పెద్ద నటుడికి కోడలిగానో, ఓ హీరోకు భార్యగానో, మరో హీరోకి తల్లిగానే కాక ఓ నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు పెండ్లి తర్వాత నట జీవితానికి విరామం ఇచ్చినా జంతు ప్రేమికురాలిగా బూ ్లక్రాస్‌ స్థాపించి మూగజీవాలకు సేవ చేస్తూ సమాజిక కార్యకర్తగా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇలా నటిగా, జంతు పరిరక్షకురాలిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఆమె పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆమె పరిచయం క్లుప్తంగా…


అమల అసలు పేరు అమల ముఖర్జీ. తల్లి ఐర్లాండ్‌ దేశస్తురాలు. తండ్రి బెంగాలీ. ఈమె పశ్చిమ బెంగాల్‌లో 1967, సెప్టెంబర్‌ 12న పుట్టారు. తండ్రి ఇండియన్‌ నేవీలో అధికారి. ఈయనకు బదిలీ కావడంతో మద్రాసు ప్రెసిడెన్సీకి వీరి కుటుంబం మారింది. అమల నృత్యకారిణి కూడా. చెన్నైలో ప్రముఖ నాట్యకారిణి రుక్మిణిదేవి అరండేల్‌ వద్ద శాస్త్రీయ నృత్య శిక్షణ తీసుకున్నారు. ఆ సమయంలోనే తమిళ దర్శకుడు భారతి రాజా దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన ‘వైశాలి’ అనే తమిళ చిత్రం ద్వారా కథానాయకిగా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత రాజేంద్ర దర్శకత్వం వహించిన మైథిలి ఎనై కదలి అనే తమిళ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అప్పటి నుండి తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో నటించారు. 1987లో కమలహాసన్‌తో ‘పుష్పక విమానం’ అనే మూకీ చిత్రంలో నటించారు. 1991లో ‘ఉలడక్కం’ అనే మలయాళ చిత్రానికిగాను ఫిలింఫేర్‌ అవార్డును అందుకున్నారు.

నాగార్జునతో పరిచయం
తెలుగులో ఈమె మొదటి చిత్రం నాగార్జున హీరోగా నటించిన కిరాయిదాదా. తర్వాత రామానాయుడు నిర్మించిన చినబాబు. ఆ తర్వాత ఆమె నాగార్జునతో నిర్ణయం, శివ, ప్రేమయుద్ధం వంటి చిత్రాలలో వరుసగా నటించారు. అప్పట్లో నాగార్జున, అమలది తిరుగులేని జోడి. చివరి సారిగా వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం నిర్ణయం. అలా నాగార్జునతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వారి వివాహానికి దారి తీసింది. వీరు 1992 జూన్‌ 11న పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. 1994లో అఖిల్‌ జన్మించాడు.

జంతు సంరక్షకురాలిగా…
వివాహానంతరం నట జీవితానికి స్వస్తి పలికిన అమల 2012లో లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అనే చిత్రంతో తిరిగి తెలుగు సినిమాలోకి ప్రవేశించారు. అమలకు చిన్నతనం నుండి జంతువులపై అమితమైన ప్రేమ. పెండ్లి తర్వాత నటనకు దూరంగా ఉన్న ఆమె జంతువుల సంరక్షణ కోసం ‘బ్లూ క్రాస్‌ సొసైటీ’ని స్థాపించి, దాని ద్వారా భారతదేశంలోని జంతువుల సంక్షేమం, జంతు హక్కుల పరిరక్షణ కోసం పని చేస్తున్నారు. తర్వాత ‘మనం’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ఒకే ఒక జీవితం’లో నటించారు.

అవార్డులు, పురస్కారాలు
సినీ నటిగా 1989లో సినిమా ఎక్స్‌ప్రెస్‌ అవార్డు, 1991 మలయాళం ఉల్లడక్కం చిత్రానికి, 2012లో లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. జంతు సంరక్షకురాలిగా, ఓ సమాజిక కార్యకర్తగా 2012లో యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా నుండి జీవ్‌ దయా పురస్కార్‌, 2017లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి నారీశక్తి పురస్కారం అందుకున్నారు.

అన్నపూర్ణ ఫిల్మ్‌ అండ్‌ మీడియా అధినేతగా
లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ తర్వాత ఆమె రెండు మలయాళం, మూడు హిందీ సినిమాలు, ఒక వెబ్‌ సీరిస్‌లో నటించారు. ప్రతి భాషలో ప్రాజెక్ట్స్‌ చేస్తున్నారు. అంతే కాదు గత ఐదేండ్ల నుండి అన్నపూర్ణ ఫిల్మ్‌ అండ్‌ మీడియాను అమలనే చూసుకుంటున్నారు. ‘వందలమంది విద్యార్థుల భవిష్యత్‌ బాధ్యత నాపై వుంది. ఈ బాధ్యతని పక్కన పెట్టి నటనలో బిజీగా వుండటం కష్టం. అయితే నా మనసుకు హత్తుకునే కథ విన్నప్పుడు, ఆ పాత్రకి నేను కరెక్ట్‌ అనిపిస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. ఒకే ఒక జీవకితం అలా మనసుకు నచ్చిన కథే. ఒక నిజాయితీతో తీసిన సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చుతుంది’ అంటూ ఒకానొక సందర్భంలో అమల మీడియాతో పంచుకున్నారు.మ‌న‌సుకు హ‌త్తుకుంటే న‌టిస్తా..

  • పాలపర్తి సంధ్యారాణి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -