Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ అరెస్టులు సరికాదు: ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్ కుమార్

అక్రమ అరెస్టులు సరికాదు: ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్ కుమార్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హుస్నాబాద్ రూరల్: ఇటీవల కాలంలో రాష్ట్ర పోలీసులు ఆయా పార్టీ, ప్రజా సంఘాలకు సంబంధం లేకున్నా, ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునివ్వకున్నా అక్రమంగా అరెస్టులకు పాల్పడటం సరికాదని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలకు పిలుపునివ్వకున్నా పోలీసులు అన్ని జిల్లాల్లో ఉన్న ఏఐవైఎఫ్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్ట్ చేసిన ఏఐవైఎఫ్ నేతలను వెంటనే విడుదల చేయాలన్నారు. అదే విధంగా కొద్దిమంది పోలీస్ అధికారులు రాజకీయ అవగాహన లోపంతో ఏ పార్టీ, సంఘాలు పిలుపు ఇచ్చిందో… ఎవరు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో ఎవరిని అదుపులోకి తీసుకోవాలో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. పోలీస్ అధికారులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -