42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లులు వెంటనే అమలు చేయాలి….
మాజీ సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు… వడ్డే బోయిన వెంకటేష్….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని శుక్రవారం జిల్లా కేంద్రం ప్రిన్స్ చౌరస్తాలో ప్రజాస్వామ్యుతంగా నిరసన దీక్ష చేస్తున్న సీపీఐ(ఎం) నాయకులు అరెస్టు చేయడం దీక్షను భగ్నం చేయడం ప్రజాస్వామ్యకమని మాజీ సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు వడ్డేబోయినా వెంకటేష్ ఒక ప్రకటనలో ఖండించారు.
నూటికి అరవై శాతం మంది ఉన్న బీసీలకు రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో సామాజిక న్యాయం కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చోద్యం చూస్తూ మతోన్మాద రంగు పులుముతూ నియంతల వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు బిజెపి శాసనసభ్యులు కూడా ఆమోదం తెలిపి పార్లమెంటులో మాత్రం బిల్లును అడ్డుకుంటుందని ఈ రకంగా బిజెపి ద్వంద వైఖరి ప్రదర్శిస్తూ పార్లమెంటులో తెలంగాణ ప్రజలను బిజెపి ప్రభుత్వం అవమానపరుస్తుందన్నారు. భువనగిరిలో సీపీఐ(ఎం) నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల దీక్షపై పోలీసుల ఓవర్ యాక్షన్ పై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించాలన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా సీపీఐ(ఎం) నాయకులు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేయడాని,నాయకుల అక్రమ అరెస్టులపై పోలీసులు వ్యవహరించిన తీరును జిల్లా వ్యాప్తంగా అభ్యుదయవాదులు ,ప్రజాతంత్రవాదులు అందరు కూడా ఖండించాలని అన్నారు.