సోమ మల్లారెడ్డి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
నవతెలంగాణ – గోవిందరావుపేట
పసర ఏటూర్నాగారం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు చెక్పోస్ట్ పెట్టి వాహనదారుల దగ్గర నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సీపీఐ(ఎం) గోవిందరావుపేట మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి ఆరోపించారు. మంగళవారం సీపీఐ(ఎం) గోవిందరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఎత్తివేయాలని వాహనదారుల దగ్గర అక్రమ వసూళ్లు ఆపాలని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ సృజన్ కుమార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారులు ప్రైవేటు వాహన ధారుల దగ్గర నుండి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారని అన్నారు. ప్రతిరోజు వేలాది వాహనాలు జాతీయ రహదారిపై నడుస్తున్నాయని తెలిపారు. జవహర్ నగర్ ప్రాంతంలో నేషనల్ హైవే అథారిటీ వాళ్లు టోల్గేట్ పెట్టి వాహన దారుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు.
ఏ చట్ట ప్రకారం జాతీయ రహదారి పై ఫారెస్ట్ అధికారులు వాహనదారుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. అడవులను వన్యప్రాణులను కాపాడాల్సిన ఫారెస్ట్ అధికారులు వసూల్ రాజాలుగా మారారని విమర్శించారు.ఈ ప్రాంతం టూరిస్ట్ కేంద్రంగా మారిందని అనేక ప్రాంతాల నుండి పసర ఎటునాగారం పరిసర ప్రాంతాల్లోకి ప్రతిరోజు వేలాదిమంది వస్తున్నారని తెలిపారు. వారు నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం అన్యాయమని అన్నారు. వసూలు చేసే అధికారం వీరికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు .ఏ జీవో ప్రకారం వసూలు చేస్తున్నారో బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. ప్రతి వాహనదారుడు ప్రభుత్వానికి రోడ్డు టాక్స్ కడుతున్నారని తెలిపారు.
ములుగు జిల్లాలో అటవీ భూగర్భ ఖనిజ చైర్మన్గా ఉన్న పోదెం వీరయ్య మంత్రిగా ఉన్న సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో చెక్పోస్టుల పేరుతో వసూళ్లకు పాల్పోవడంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రతిరోజు ఈ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వీరికి చెక్పోస్టు కనబడడం లేదా అని అన్నారు. పసర ఎటునాగారం మధ్యలో ఉన్న రెండు చెక్పోస్ట్ లను వెంటనే ఎత్తివేయాలని లేనట్లయితే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొదిల్ల చిట్టిబాబు,తుమ్మల వెంకటరెడ్డి ,గోవిందరావుపేట మండల కమిటీ సభ్యులు తీగల ఆగిరెడ్డి,గొంది రాజేష్ , క్యాతం సూర్యనారాయణ. ఐలయ్య, గొర్ల శీను,కవిత,సువర్ణ,ముత్తమ్మ ,తదితరులు పాల్గొన్నారు.
ఫాస్ట్ ట్రాక్ పేరుతో అక్రమ వసూళ్లు ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES