Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్…?

ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్…?

- Advertisement -

ప్రజావాణిలో మూడుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  / బొమ్మలరామారం

ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి  కొడుతూ దర్జాగా లక్షల సంపాదిస్తున్న ప్రభుత్వాధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. వివరాలను పరిశీలిస్తే బొమ్మలరామారం మండలం జలాల పురం గ్రామం  సర్వే నెంబర్ 180లో ఒక ఎకరం 14 గంటల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూములు  రాళ్లను కొట్టి ప్రభుత్వానికి నష్టం చేకూర్చుతూ.. లక్షలు అక్రమ సంపాదన చేస్తూ,  ఆ గ్రామంలో కొంతమంది పెద్దలకు నెలకు లేదా ఆరు నెలలకు ఒకసారి ముడుపులు ముడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

కాగా 2019 సంవత్సరంలో కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీ కావడంతో ఆ గ్రామంలో కొంతమంది పెద్దలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ విషయంపై ఈ నరసింహులు అనే వ్యక్తి తాసిల్దార్ కు ఫిర్యాదు చేయగా, తాసిల్దార్ నామమాత్రంగా విచారణ జరిపి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్కు పిలిచి రెండు గంటల లోపే వదిలిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఇలా చేసిన ఇప్పటికి మూడుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం విశేషం. అయినప్పటికీ అక్రమ మైనింగ్ వ్యవహారం పై ఇంతవరకు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి… టి నరసింహులు

జలాల్ పురం అక్రమమైన ఇంకా చర్యలు తీసుకోవాలని కోరుతూ  ఇప్పటికి ప్రజావాణిలో మూడుసార్లు ఫిర్యాదు చేసినట్లు నరసింహులు తెలిపారు.  ఆర్డీవో, తాసిల్దార్, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు పోలీస్ స్టేషన్కు పిలిపించి విడిపించినట్లు తెలిపారు. అయినప్పటికీ అక్రమ మైనింగ్  కొనసాగుతుందని వాపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -