రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా..
పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం..
నవతెలంగాణ – మద్నూర్
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం ఆంగ్లేయుల చేతిలో బానిస బతుకులు బతికి, మహనీయుల పోరాటంతో ఆంగ్లేయులను తరిమికొట్టి స్వతంత్రాన్ని సాధించుకున్నాము. కానీ మహారాష్ట్రకు అక్రమ ఇసుక దారుల చేతిలో బానిస బతుకులే బతుకుతున్నాము. మహారాష్ట్రకు చెందిన అక్రమ ఇసుకదారులు మన మంజీరా నది నుంచి రాత్రింబవళ్లు తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదంతా తెలిసినా తెలియనట్లు మన ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు మూసుకుని పరిపాలన సాగిస్తోందా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ట్రాక్టర్ చెక్కలతో నిండిన ఇసుక మహారాష్ట్రలో రూ.15000 పలుకుతున్నట్లు వినికిడి. కానీ అదే చెక్కల ట్రాక్టర్ ఇక్కడ రూ. 8 వేలే పలుకుతోంది.
స్థానిక ఇండ్లు తేని పేద ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక అడిగితే సరిపడా ఇసుక ఇవ్వలేని ప్రభుత్వ యంత్రాంగం మహారాష్ర్టకు టన్నుల కొద్దీ అక్రమంగా ఇసుక రవాణా అవుతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని అంటున్నారు. పెద్ద తడుగూరు రోడ్డు గుండా మహారాష్ట్ర ప్రాంతానికి అక్రమ ఇసుక తరలిపోతున్నప్పుడు నవతెలంగాణ కెమెరాలో చిక్కిన దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా ప్రజల ముందుంచుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద తడుగూరు రోడ్డు గుండా చెక్కలతో కూడిన ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు తరలి వెళ్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, అక్రమ రవాణా పట్ల పకడ్బందీ చర్యలు చేపట్టి, మహారాష్ట్ర అక్రమ ఇసుకదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నారు.
మహారాష్ర్టకు తరలివెళుతున్న అక్రమ ఇసుక.. పట్టించుకోని ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES