- Advertisement -
నవతెలంగాణ – శంకరపట్నం
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వీణవంక మండలం కోర్కల్ గ్రామం నుండి హుజూరాబాద్‌కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామ శివారులో వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఎస్సై శేఖర్ రెడ్డి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్ సుద్దాల దేవుడుపై కేసు నమోదు చేసినట్లు, ఎస్సై తెలిపారు.
- Advertisement -