Tuesday, September 16, 2025
E-PAPER
Homeకరీంనగర్అక్రమ మట్టి రవాణా..టిప్పర్, జేసీబీ పట్టివేత

అక్రమ మట్టి రవాణా..టిప్పర్, జేసీబీ పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ-శంకరపట్నం: శంకరపట్నం మండలం, కొత్తగట్టు గ్రామ శివారులో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో, హుజురాబాద్ కు చెందిన వేణు, రంగాపూర్ గ్రామ నివాసి రాపోలు కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ తనిఖీల్లో మట్టి తవ్వకానికి ఉపయోగిస్తున్న ఒక జేసీబీ, ఒక టిప్పర్ వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు శంకరపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ- “ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా మట్టిని తవ్వినా, రవాణా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -