Saturday, September 13, 2025
E-PAPER
Homeకరీంనగర్పశువుల పాకలో టేకు దుంగల అక్రమ నిల్వ

పశువుల పాకలో టేకు దుంగల అక్రమ నిల్వ

- Advertisement -

-అల్లీపూర్ సెక్షన్ అటవీ ప్రాంతంలో టేకు చెట్ల నరికివేత
-అక్రమాలకు అటవీ ఉద్యోగుల అండదండలేనా?
నవతెలంగాణ – రాయికల్
అల్లీపూర్ గ్రామ ఎగ్గల్ చెరువు సమీపంలోని ఓ పశువుల పాకలో టేకు దుంగలను అక్రమంగా నిల్వ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల రేంజ్ పరిధిలోని అల్లీపూర్ సెక్షన్ అటవీ ప్రాంతంలో కొంతకాలంగా టేకు చెట్లను యథేచ్చగా నరికి,ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా చెరువు దగ్గర డంప్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ టేకు దుంగలతో దర్వాజాలు,కిటికీలు,ఇతర గృహ సామగ్రి తయారు చేసి,అందిన కాడికి అమ్మకాలు జరుపుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ అక్రమాలకు అటవీ శాఖలో పనిచేస్తున్న ఓ వ్యక్తి అండదండలు ఇస్తున్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -