Friday, October 17, 2025
E-PAPER
Homeకరీంనగర్నిరక్షరాస్య వయోజన మహిళలకు అక్ష్యరాస్యతపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

నిరక్షరాస్య వయోజన మహిళలకు అక్ష్యరాస్యతపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

- Advertisement -

ఉల్లాస్ పై సమీక్ష సమావేశం
నవతెలంగాణ -రాజన్న సిరిసిల్ల

జిల్లాలోని నిరక్షరాస్య వయోజన మహిళలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎం. హరిత ఆదేశించారు. అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్)పై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యాశాఖ, మెప్మా శాఖ అధికారులతో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో  సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని నిరక్షరాస్య వయోజన మహిళలకు ఫౌండేషనల్ లిటరసీ, బేసిక్ ఎడ్యుకేషన్ తదితర అంశాలపై అవగాహన అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. వయోజనుల కోసం అక్షర వికాసం, వాలంటీర్ల కోసం మార్గదర్శిని పుస్తకాలు ప్రభుత్వం జిల్లాకు పంపిణీ చేసిందని తెలిపారు. అక్షర వికాసం పుస్తకాలు 21,894 రాగా, మార్గ దర్శిని 2,190 పుస్తకాలు వచ్చాయని వెల్లడించారు.

ఈ సంవత్సరం జిల్లాలో 23, 387 మంది వయోజనులను గుర్తించామని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా అమలు చేసేందుకు నిర్ధిష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ శేషాద్రి, అడిషనల్ డిఆర్ డి ఓ శ్రీనివాస్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, వయోజన విద్య శాఖ అధికారి ఆంజనేయులు, అన్ని మండలాల ఎంఈఓలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -