నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులు కురిసిన వర్షాలకు కామారెడ్డి పట్టణంతోపాటు ఇతర గ్రామాలలో వర్షాభాగానికి తీవ్రంగా నష్టపోయిన బాధితులకు కామారెడ్డి జిల్లా ఐఎంఎస్ సంఘం ఆధ్వర్యంలో రోజువారీ అవసరాల వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఐఎంఏ ప్రధాన కార్యదర్శి అరవింద గౌడ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదై, వర్షం తీవ్రంగా కురవడంతో ఇండ్లలోకి నీరు చేరి ఇండ్లలో ఉన్న కట్టుబట్టలతో సహా పూర్తిగా వర్షానికి తడిసి ముద్దు కావడంతో వారికి ప్రభుత్వం నుండి కావలసిన పూర్తి సహాయం తక్కువగా అందడంతో, వర్షాభావం తీవ్రంగా ప్రభావితమైన వరద ప్రభావిత గ్రామాలను ఐఎంఏ సభ్యులు సందర్శించి వారికి కావలసిన సామాగ్రిని ఆదివారం పంపిణీ చేశారు. రోజువారీ అవసరాలు వస్తువులైన బియ్యం, పప్పు, నూనె, డిటర్జెంట్ సబ్బులు, దుప్పట్లు, తువ్వాలు, వేసుకొనే దుస్తులు: చీరలు, లుంగీలు, టీ-షర్టులు తదితర వాటిని అందించడంతో వాటిని అందుకున్న బాధితులు మీరు మాకు ఇంత సాయం చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు అన్నారు.ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త స్వర్ణ లత, జీవదాన్ పాఠశాల బృందం, ఐఎంఏ సభ్యులు ప్రముఖ న్యూరోజారాలజిస్ట్గీ డాక్టర్, గిరెడ్డి రవీందర్ రెడ్డి, డాక్టర్ అనూష , పవన్ ఐఎంఎస్ సభ్యులు పాల్గొన్నారు.
పలు ప్రాంతాలలో వరద బాధితులకు సహాయం అందించిన ఐఎంఏ
- Advertisement -
- Advertisement -