Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుట్యాంక్ బండ్ పై గణపతుల నిమజ్జనాలు..

ట్యాంక్ బండ్ పై గణపతుల నిమజ్జనాలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ట్యాంక్ బండ్ పై గణపతుల నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. డప్పుల సప్పులతో కళాకారుల నృత్యాలతో గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలైన నెక్లెస్ రోడ్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్, మింట్ కాంపౌండ్ లిబర్టీ, లకిడికపూల్‌లో భక్తులు గణపతి బప్పా మోరియా , జై బోలో గణేష్ మహారాజ్ జై అంటూ నినాదాలు మార్మోగిపోతున్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్‌టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా, సంజీవయ్య పార్కు, తదితర ప్రాంతాల్లో పదిహేను క్రేన్లు,కంట్రోల్‌ రూమ్‌లు, మెడికల్‌ క్యాంపులు, మొబైల్‌ టాయిలెట్లు, తదితర సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad