- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు మండలంలోని పెద్ద తడుగూరు గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. సార్వజని గణేష్ మండలి ఆధ్వర్యంలో వార్కారి భజన మండలి ద్వారా గ్రామంలో నిమజ్జన శోభాయాత్ర ఘనంగా ప్రారంభించారు. గ్రామంలోని అన్ని గణేష్ మండలా నిమజ్జన కార్యక్రమం ఉత్సాహంగా ఘనంగా జరిగాయి. యువకులు చిన్నారులు పెద్దలు మహిళలు ప్రతి ఒక్కరు గణేష్ నిమజ్జనం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమానికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- Advertisement -