Saturday, January 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకవయిత్రిపై ఇమ్మిగ్రేషన్ అధికారుల కాల్పులు..యూఎస్ వ్యాప్తంగా నిర‌స‌న‌లు

కవయిత్రిపై ఇమ్మిగ్రేషన్ అధికారుల కాల్పులు..యూఎస్ వ్యాప్తంగా నిర‌స‌న‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అమెరికాలోని మిన్నియాపాలిస్ లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసిఇ) అధికారులు బుదవారం జరిపిన కాల్పుల్లో ముగ్గురు పిల్లల తల్లి, కవయిత్రి అయిన రెనీ నికోల్ మాక్లిన్ గుడ్ (37) మృతి చెందారు. ఈ సంఘటన దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. నార్త్ కరోలినాలోని ట్రయాంగిల్ ప్రాంతంలో పార్టీ ఫర్ సోషలిజం అండ్ లిబరేషన్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మిన్నియాపాలిస్ వీధుల్లో నివాళులు అర్పిస్తూ నిరసనకారలు కవాతు నిర్వహించారు. న్యూయార్క్ నగర వీధుల్లో రాత్రి జాగరణలు, ర్యాలీలు నిర్వహించారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఐసిఇ కార్యాలయం వద్ద వందలాది మంది నిరసన తెలిపారు.

చికాగో, ఒరెగాస్, అరిజోనా, కాలిఫోర్నియాలో నిరసన ప్రదర్శనలు, బహిరంగ సభలు జరిగాయి.. కొలరాడోలో జన్మించిన రెనీ నికోల్ మాక్లిన్ సామాన్య అమెరికా పౌరురాలు. గత సంవత్సరం కాన్సాస్ సిటీ నుండి మిన్నియాపాలిస్కు మారిన ఆమె, బుదవారం తన ఆరేళ్ల కొడుకును పాఠశాలలో దింపి, తన భర్తతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా, మిన్నియాపాలిస్ లోని ఒక వీధిలో ఐసిఇ అధికారులు అడ్డగించి కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. అయితే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వీడియోల్లో ఒక అధికారి ఆమె కారు వద్దకు వచ్చి, తలుపు తెరవమని డిమాండ్ చేస్తూ, హ్యాండిల్ను పట్టుకోవడం కనిపిస్తుంది. దాంతో కంగారుపడిన ఆమె కారును ముందుకు కదిలించింది. వాహనం ముందు నిలబడి ఉన్న మరొక ఐసిఇ అధికారి తన ఆయుధాన్ని తీసి కారు పైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే అధికారులు ఆమె ఫెడరల్ ఏజెంట్లను తన కారుతో ఢీకొట్టడానికి ప్రయత్నించిందని, ఉగ్రవాది అని తెలపడం గమనార్హం…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -