సిద్ధమవుతున్న అధికార, ప్రతిపక్షాలు
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ సిద్ధం అవుతున్నాయి. ఈ సంవత్సరం బీహార్‌లో కీలకమైన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీనియర్ న్యాయమూర్తుల తొలగింపుతో తనపై ఉన్న అవినీతి ముద్రను తగ్గించుకునేందుకు, ‘అవినీతి వ్యతిరేక’ సానుకూలతను పెంచుకునేందుకు దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది.
ఇద్దరు న్యాయమూర్తులు, రెండు వివాదాలు
అప్పటి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాలిపోయిన డబ్బుల కుప్పలు కనిపించిన తరువాత ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఆయనపై అభిశంసనకు సిద్ధమయ్యాయి. మరోపక్క తనను తొలగించాలని సిఫారసు చేసిన న్యాయవ్యవస్థ అంతర్గత నివేదికను సవాలు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మితవాద సంస్థ విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తరువాత జస్టిస్ శేఖర్ యాదవ్‌పై అభిశంసన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనను తొలగించాలని కోరుతూ 55 మంది ఎంపీల బృందం రాజ్యసభకు లేఖ కూడా రాసింది.
33 శాతం హైకోర్టు పోస్టులు ఖాళీలు
అయితే, అభిశంసనలు ప్రాధాన్యాంశంగా మారినప్పటికీ, న్యాయవ్యవస్థ దాని సంఖ్యా సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అడిగిన ప్రశ్నకు సమాధానంగా న్యాయ మంత్రిత్వ శాఖ అర్జున్ రామ్ మేఘ్వాల్ సమాధానం ఇస్తూ 371 (33 శాతం) హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మొత్తం 1,122 హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 751 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న 178 పోస్టులను భర్తీ చేయడానికి ప్రతిపాదనలను ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలిస్తున్నాయి. 193 పోస్టులకు సంబంధించిన సిఫారసులు ఇంకా హైకోర్టు కొలీజియాల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
ఎందుకు ఆలస్యం?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 217, 224 ప్రకారం నియామక ప్రక్రియ ఉంటుంది. మొత్తం ప్రక్రియ అనేక దశలను కలిగి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తరువాత హైకోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు ఒక షార్ట్‌లిస్ట్‌ను రూపొందిస్తారు. ఈ సిఫారసులను సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం కోసం పంపుతారు. అయితే, ఏదైనా ఖాళీ ఏర్పడటానికి ఆరు నెలల ముందు హైకోర్టులు ఈ సిఫారసులను సమర్పించాలని మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, న్యాయ మంత్రిత్వ శాఖ కాలక్రమం పాటించటం లేదు.
ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES