జీడీపీ
0.5శాతం తగ్గొచ్చు
– దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం : ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
– అమల్లోకి తొలి దశ 25శాతం టారిఫ్‌లు
హైదరాబాద్ : భారత ఉత్పత్తులపై అమెరికా ప్రకటించిన అధిక సుంకాలు మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. యుఎస్ సుంకాలతో భారత ఆర్థిక వ్యవస్థ తన వృద్ధి రేటులో 50 బేసిస్ పాయింట్ల (0.5 శాతం) తగ్గుదలను చవి చూడనుందన్నారు. అయితే.. భారత్ ఈ తగ్గుదలను ఒక సంవత్సరం వరకు మాత్రమే తట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ఇది ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సుబ్బారావు అన్నారు. ”భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదులపై ఉంది. 50 బేసిస్ పాయింట్ల వృద్ధి తగ్గుదలను ఒక సంవత్సరం పాటు తట్టుకోగలదు. కానీ అది ఎక్కువ కాలం కొనసాగితే ముఖ్యంగా ఎగుమతులు, ద్రవ్యోల్బణం, విదేశీ మారక ద్రవ్యం స్థిరత్వంపై ఒత్తిడి పెరుగుతుంది.” అని సుబ్బారావు అన్నారు.
పొంచి ఉన్న సవాళ్లు
ప్రస్తుతం భారత్ 7 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తోందని సుబ్బారావు తెలిపారు. ట్రంప్ విధించిన అధిక సుంకాలు, అంతర్జాతీయ వాణిజ్య ఆందోళనలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు భారత వృద్ధిని ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. యుఎస్ అధిక సుంకాలు ఎగుమతి ఆదాయాన్ని తగ్గించి, ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. అయితే.. ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు ఈ టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉండటం.. భారత్‌కు కొంత ఊరటనిస్తుందన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ కొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని సూచించారు. దేశీయ తయారీని ప్రోత్సహించాలని, ఇతర ఇంధన మార్కెట్లను అన్వేషించాలని సుబ్బారావు సూచించారు. ఆసియా, ఆఫ్రికా, యూరోపియన్ దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలపై దృష్టి పెట్టాలన్నారు.
వృద్ధికి విఘాతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES