Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నిజామాబాద్ లో సెక్షన్ 163 అమలు 

నిజామాబాద్ లో సెక్షన్ 163 అమలు 

- Advertisement -

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: టీజీ డి ఈ ఈ సి ఈ టి(TG DEECET)- 2025 ఎంట్రన్స్ పరీక్ష నిర్వహణ కోసం నిజామాబాద్ డివిజన్ లో మూడు పరీక్ష కేంద్రల కోసం మే 25వ తేదీ ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిషేధిత ఆదేశాలు శుక్రవారం జారీచేశారు. కావున డివిజన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు గా నిరోధించాలనే ఉద్దేశ్యంతో కమీషనర్ అండర్ సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ అమలులో ఉంటుంది అని తెలిపారు.అండర్ సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ ప్రకారం  ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమి కూడరాదు. నిషేదిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరుగవద్దు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ సెంటర్‌ లను 25-05-2025 (ఉదయం 07.00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు) మూసివేసి ఉంచాలి. నిషేధిత ఉత్తర్వులు 25-05-2025 (ఉదయం 07:00 నుండి సాయంత్రం 6:00 వరకు) అమలులో ఉంటాయని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad