నవతెలంగాణ – గోవిందరావుపేట
భారీ వర్షాల కారణంగా పస్రా పోలీస్ వారు ప్రజలకు, రైతులకు చేయు ముఖ్య సూచన ఏమనగా.. రానున్న రెండు మూడు రోజుల్లో మన ప్రాంతానికి విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకుని అవసరముంటే మాత్రమే ఇంటి నుండి బయటకు రావాలి. కరెంటు స్తంభాలు పక్కన ఉన్న తీగలును, ఐరన్ తీగలు పొరపాటున కూడా ముట్టుకోవద్దు. ఎవరైనా పాత ఇంట్లో నివసిస్తుంటే ఆ ఇళ్లను తక్షణమే ఖాళీ చేయాలి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అట్టి ప్రాంతాల్ని ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకి వచ్చి ఉండాలి. అనవసరంగా వాగులుని దాటవద్దు. ఎక్కడైనా రోడ్ల మీదకి నాళాలు పొంగి ప్రవహిస్తుంటే దాని పైనుండి ఎవరు దాటవద్దు. అత్యవసరం ఐతే పస్రా పోలీస్ వారి ప్రత్యేక బృందాలు 24 గంటలు అందుబాటులో ఉంటారు. కావున.. పస్రా పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరు. సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నెంబర్లు – 8712670085 ఎస్ ఐ పసర, 8712670086 పోలీస్ స్టేషన్, పసర.
ప్రజలకు పసర పోలీసుల ముఖ్య సూచన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES