- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమై ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా తమ కళలను ప్రదర్శించారు. అనంతరం ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్లు విక్టర్ మధుమొహాన్ లు హాజరై ప్రదర్శనలను తిలకించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధికారులు, సారధి కళాకారులు, ఉపాద్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
- Advertisement -



