Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయంప్రజాస్వామ్యంలో ఎవరు ఎన్నికైనా వారితో కలిసి పనిచేయాలి: శశిథరూర్

ప్రజాస్వామ్యంలో ఎవరు ఎన్నికైనా వారితో కలిసి పనిచేయాలి: శశిథరూర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఎవరు ఎన్నికైనా వారితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొందరు కాంగ్రెస్ నేతలు ఆయనపై విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న శశిథరూర్ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందించారు. ప్రతి ఒక్కరూ ఒకే సిద్ధాంతాలను అనుసరిస్తూ కేంద్రానికి సహకరించకపోతే కొన్ని పనులు ముందుకు సాగవని ఆయన అన్నారు. కేవలం సైద్ధాంతిక స్వచ్ఛతతోనే దేశం అభివృద్ధి చెందదని, పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ఎన్నికైనప్పుడు వారితో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.

రాజకీయ పార్టీలు, నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనబెట్టి, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. ప్రజలు సిద్ధాంతాలపై ఆసక్తి చూపుతారని, కానీ రాజకీయ పార్టీలు మాత్రం మొండిగా వ్యవహరిస్తే చాలా పనులు జరగవని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని, అలా చేయకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల ఒక కార్యక్రమంలో తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించినట్లు కొందరు చెబుతున్నారని, అయితే తాను కేవలం ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలను మాత్రమే ప్రస్తావించానని, ఆయనను పొగడలేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ తన వ్యాఖ్యలపై విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. దేశంలో ఇలాంటి వాతావరణం ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -