Saturday, January 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపల్నాడు బ్యాక్‌డ్రాప్‌లో..

పల్నాడు బ్యాక్‌డ్రాప్‌లో..

- Advertisement -

హీరో తిరువీర్‌ నటిస్తున్న కొత్త సినిమా ‘భగవంతుడు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఏషియన్‌ ఫిలిమ్స్‌ నారాయణ దాస్‌ నారంగ్‌, పనస శంకరయ్య గౌడ్‌ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌ పై ప్రొడక్షన్‌ నెంబర్‌.1గా నిర్మిస్తున్నారు రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవు తున్నారు. రొమాంటిక్‌ పీరియడ్‌ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ సమ్మర్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను హీరోలు విశ్వక్‌ సేన్‌, సందీప్‌ కిషన్‌ రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ జి.జి. విహారి మాట్లాడుతూ,’నేను సినిమా పాత్రికేయుడిగా కెరీర్‌ స్టార్ట్‌ చేశా. ఈ మూవీ టీజర్‌ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. నేను ఈ సినిమా విషయంలో వేణు ఊడుగుల, రవి పనసకు కృతజ్ఞతలు చెప్పాలి. మనల్ని మనం అర్థం చేసుకునేందుకు, మన చుట్టూ ఉన్న, సమాజం ఉన్న వైరుధ్యాలు తెలుసుకునేందుకు కథలు చెబుతాం.

ఈ అవగాహనతో నేను రూపొందించిన చిత్రమిది. పల్నాడు యుద్ధాన్ని తెలుగు మహాభారతం అంటారు. మన రూట్స్‌ అన్నీ పల్నాడులోనే ఉన్నాయి. తెలుగు వారు మర్చిపోయిన వైరుధ్యాలు పల్నాడులోనే పుట్టాయి. ఇప్పటికీ అక్కడ కత్తుల్ని దైవాలుగా కొలుస్తారు. వెయ్యేళ్ల కిందటే మన సమాజంలోని అంతరాలకు సమాధానం పల్నాడులో చెప్పడం జరిగింది. అందుకే ఈ సినిమాకు పల్నాడు బ్యాక్‌ డ్రాప్‌ తీసుకున్నాను’ అని అన్నారు. ‘డైరెక్టర్‌ విహారి ఈ కథ చెప్పినప్పుడు ‘అసురన్‌, కాంతార, కర్ణన్‌, జైభీమ్‌’ వంటి సినిమాలు గుర్తొచ్చాయి. ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయాలని ప్లానింగ్‌లో ఉన్నాం’ అని ప్రొడ్యూసర్‌ రవి పనస చెప్పారు. హీరో తిరువీర్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాలో మేమంతా ఒకరితో ఒకరం పోటీ పడి నటించాం. నన్ను నమ్మండి ఈ సినిమా చాలా గొప్ప సినిమా అవుతుంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -