Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeమానవికలబందలో....

కలబందలో….

- Advertisement -

పొడి చర్మం ఉన్నవారి ముఖం డల్‌గా కనిపిస్తుంది. తేమ శాతాన్ని పెంచుకోవాలంటే కొద్దిగా కలబంద గుజ్జులో కాస్త ఆలివ్‌ ఆయిల్‌ని వేసి మెత్తటి పేస్ట్‌లాగా కలుపుకోవాలి. తర్వాత ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. మీ చర్మానికి తేమ అందుతుంది.

ట్యాన్‌ను తొలగించుకోవాలంటే..

చర్మంపై ఎండ పడి ట్యాన్‌ సమస్య రావడం సర్వసాధారణం. కాస్త కలబంద గుజ్జు తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉండే ప్రదేశంలో రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. దీనివల్ల కేవలం ట్యాన్‌ మాత్రమే కాదు.. మొటిమలు కూడా తగ్గిపోతాయి.
మృదువైన చర్మం కోసం..
కలబంద చర్మానికి తేమను అందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. టేబుల్‌స్పూన్‌ కలబంద గుజ్జులో, రెండు టేబుల్‌స్పూన్ల వెన్న, చిటికెడు పసుపు వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముఖం, మెడపై అప్లై చేసుకొని అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్‌ వారానికి రెండు సార్లు రాస్తే.. మదువైన చర్మం మీ సొంతం అవుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad