సర్పంచ్ అభ్యర్థిగా చేతాళ్ల జంగయ్య
కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు
సీపీఐ(ఎం) నాలుగు, కాంగ్రెస్ ఆరు వార్డుల్లో కలిసి పోటీ
ప్రజా పోరాటాల వారసుడిగా మరో సారి ఎన్నికల బరిలోకి
అతిచిన్న వయస్సులోనే ఎంపీటీసీగా చేసిన అనుభవం
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జంగయ్య
కత్తెర గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
కప్పపహాడ్ ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. ఆయన అందరికీ సుపరిచితుడే. పదేండ్ల చిన్నారి మొదలుకొని పండు ముసులి వరకు గుర్తు పట్టని వరంటూ ఉండరు. భూపోరాటాన్ని ముందుండి నడిపించిన నాయకుడు. ప్రజల్లో ఉంటూ వారి సమస్య పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్న కమ్యూనిస్టు బిడ్డ. ప్రజా పోరాటాల వారసునిగా మరోసారి ఎన్నికల బరిలో నిలిచాడు. ఎంపీటీసీగా పనిచేసే అనుభవంతో ముందుకు సాగుతున్నాడు. ప్రజల్లో ఒక్కడిగా మెలుగుతూ వారి సమస్యలే ఎజెండాగా పరిష్కారానికి కృషి చేస్తూ వస్తున్న చేతాళ్ల జంగయ్య ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ బలపర్చిన సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ నెల 17వ తేదీన జరిగే పోలింగ్‌లో తనకు ఎన్నికల సంఘం కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నాడు. భారీ జన సందోహం మధ్య తన ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. తాను నిర్వహిస్తున్న ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కప్పపహాడ్ గ్రామం కమ్యూనిస్టులకు కంచుకోట. ప్రజా ఉద్యమాలకు కేంద్రం బిందువు. సుమారు 100 ఎకరాలపై భూపోరాటం కొనసాగుతున్న తరుణం. ఈ ప్రాంతంలో భూస్వామి చేతుల్లోని వందలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయాలని సాగిన పోరాటానికి సీపీఐ(ఎం) నాయకత్వం వహిస్తుంది. ఈ పోరాటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకే సాగుతోంది. అన్ని అవాంతరాలను ఎదురొడ్డుతూ న్యాయస్థానాల్లోనూ విజయం సాధిస్తు వస్తుంది. అలాంటి పోరాట కేంద్రమైన కప్పపహాడ్ ఎన్నికల బరిలో ఆ పోరాటాల వేగుచుక్క సీపీఐ(ఎం) వారసునిగా ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చేతాళ్ల జంగయ్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మొత్తం 10 వార్డులకుగాను కాంగ్రెస్ 6 వార్డుల్లో పోటీ చేస్తుండగా, సీపీఐ(ఎం) సర్పంచ్‌తో పాటూ, నాలుగు వార్డుల్లో పోటీ చేస్తోంది. తాను సర్పంచ్‌గా గెలిస్తే చేయబోయే అభివృద్థిపై స్పష్టమైన మ్యానిఫెస్టో ప్రకటించారు.
కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు..
కప్పపహాడ్‌లో సర్పంచ్, వార్డు స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ(ఎం) కలిసి పోటీ చేస్తున్నాయి. సర్పంచ్ అభ్యర్థిగా చేతాళ్ల జంగయ్యకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మొత్తం 10 వార్డులకు గాను కాంగ్రెస్ 6, సీపీఐ(ఎం) సర్పంచ్, నాలుగు వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. ఇక్కడ గెలుపు లక్ష్యంగా ప్రజా క్షేత్రంలో కూటమీ దూసుకుపోతోంది. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఎన్నికల మ్యానిఫెస్టో..
1.కప్పపహాడ్ నుంచి ఎలిమినేడు రోడ్డు నిర్మాణానికి కోసం కృషి.
2.ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇప్పించడం.
3.రేషన్ కార్డులు సకాలంలో ఇప్పించడం.
4.రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు రైతు అవగాహన సదస్సులు, రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు సకాలంలో వచ్చే విధంగా కృషి.
5.మహిళలకు స్వయం ఉపాధి పొందే విధంగా ఉపాధి శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించడం.
6.అంగన్‌వాడీ పిల్లలు, బాలింతలు, గర్భిణుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ.
7.ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సాయంత్రం ఫ్రీగా ట్యూషన్ చెప్పించడానికి ప్రయత్నం.
8.ఉన్నత విద్యను అభ్యసించి ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాల కల్పనకు కృషి.
9.పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గ్రంథాలయం ఏర్పాటు చేసి వారికి అవసరమయ్యే పుస్తకాలు అందుబాటులో పెట్టడం.
10.వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు పింఛన్లలో ఎలాంటి జాప్యం లేకుండా ఇప్పించడం.
11.గ్రామంలో తాగునీరు, మురికి కాలువల నిర్మాణం, వీధి దీపాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సమస్య లేకుండా చూడడం.
12.ప్రీ ప్రైమరీ స్థాయి నుంచి పిల్లలకు విద్యాభివృద్ధికి ప్రత్యేక దృష్టి.
13.ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారం వారికి అవసరమైన పాఠ్యపుస్తకాలు, తాగునీరు, యూనిఫాం, టై, బెల్టు, స్పోర్ట్స్ యూనిఫాం, షూ ఇచ్చే విధంగా కషి చేయడం. గ్రామ పెద్దల సూచనలు, సలహాలు, గ్రామస్తుల సహాకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేయడం అని తన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించారు.
ఎంపీటీసీగా చేసిన అభివృద్ధి..
1.2001లో కప్పపహాడ్‌కు జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అతిచిన్న వయస్సులోనే విజయం సాఘించారు. ఆ సందరర్భంగా గ్రామానికి బీటీ రోడ్డు లేకపోవడంతో ఎంపీటీసీగా ఉన్నప్పుడు రూ.40లక్షల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణం చేయించారు.
2.కప్పపహాడ్ నుంచి తుల్లేకలాన్ వరకు రూ.20లక్షల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణం.
3.గ్రామంలో నీటి ఎద్దడి తీర్చడానికి కృష్ణానీటి కోసం 2004లో పోరాటం చేసి తాగునీరు సాధించాం.
4.2018లో వివిధ కంపెనీల పేరుతో కప్పపహాడ్‌లో భూసేకరణ జరిగినప్పుడు నిర్వహించిన రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి విజయం సాధించారు. పట్టా భూముల సేకరణ వెనుకకు తీసుకునేలా ప్రభుత్వంతో పోరాటం ద్వారా విజయం.
5.2001-2006 కప్పపహాడ్‌లో నీటి సమస్య తీవ్రతరం కావడంతో నాడు గ్రామంలో బస్తీల్లో బోర్లు వేసి నీటి సమస్య తీర్చడం జరిగింది.
6.తాను ఎంపీటీసీగా ఉన్నప్పుడు విద్యాభివద్ధికి నూతన భవన చేయించి నాటి హౌం మంత్రి దేవేందర్ గౌడ్ చేతుల మీదుగా అదనపు తరగతి గదులను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తెవడం జరిగింది.
7.జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చెరువుల పరిరక్షణ, పూడిక తీయించి చెరువు అభివృద్ధికి కృషి చేయడం జరిగింది.
8.కప్పపహాడ్‌లో రైతులకు ఏ భూ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించడానికి రైతులకు అండగా నిలిచారు.
9.గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించుకునే వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహౌత్సవానికి తన ఆర్థిక సహాయం, బీరప్ప జాతరకు ఆర్థిక సహాయం చేస్తూ ప్రజల మన్ననలు పొందారు.
10.యువత చెడు వ్యవసానాలకు లోనుకాకుండా యువకులు నిర్వహిస్తున్న క్రీడలకు అండగా నిలవడం.గ్రామ క్రీడా కారులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు.ఇక గత 30 సంవత్సరాలుగా ప్రజల కోసమే పని చేస్తున్న జంగయ్యను గెలిపించేందుకు గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలో కలిసి వస్తున్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రైతులకు అండగా నిలుస్తున్నారు. వ్యవసాయ కార్మిక సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఉపాధిహామీ కూలీలకు అండగా నిలిచారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ఉద్యమించారు. ఆ పోరాటాలకు నాయకత్వం వహించారు. ఈ తరుణంలో జరిగుతున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తనను గెలిపించాలని కోరుతున్నారు.



